NTV Telugu Site icon

David Warner: వంద సిక్సులు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఖాతాలో మరో రికార్డ్

David Warner

David Warner

ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌లో సిక్సర్ల శతకం పూర్తి చేసుకున్నాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో నేడు (సెప్టెంబర్‌ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ భాయ్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ప్లేయర్ గా ప్లేయర్ గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్‌ కూడా కొట్టి తన సిక్సర్‌ల సంఖ్యను కేవలం 148 మ్యాచ్ ల్లోనే 101కి పెంచుకున్నాడు.

Read Also: India-China: భారత ఆటగాళ్లకు అనుమతివ్వని చైనా.. పర్యటన రద్దు చేసుకున్న అనురాగ్

ఇక, ఈ ఇన్నింగ్స్‌లో 53 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 రన్స్ చేసి.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు​ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. డేవిడ్ వార్నర్‌ (52 ), మిచెల్‌ మార్ష్‌ (4), స్టీవ్‌ స్మిత్‌ (41), మార్నస్‌ లబూషేన్‌ (39), కామెరిన్ గ్రీన్(31)లు అవుట్ కాగా.. ప్రస్తుతం క్రీజులో జోష్ ఇంగ్లిస్ ( 15 ), మార్కస్ స్టోయినీస్ (4 ) ఉన్నారు. ఇక, టీమిండియా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లను కట్టిడి చేస్తున్నారు.

Read Also: Danish Ali: “రాత్రంతా నిద్రపోలేదు”.. బీజేపీ ఎంపీ మతపరమైన వ్యాఖ్యలపై డానిష్ అలీ

ఇక, వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్‌ మాజీ ప్లేయర్ షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది.. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (331), రోహిత్‌ శర్మ (286), సనత్‌ జయసూర్య (270), మహేంద్ర సింగ్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత ఆటగాళ్లు సచిన్‌ టెండూల్కర్ (195), సౌరబ్ గంగూలీ (190), యువరాజ్‌ సింగ్‌ (155), విరాట్‌ కోహ్లి (141), వీరేంద్ర సెహ్వాగ్‌ (136), సురేశ్‌ రైనా (120) 100 సిక్సర్లు కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఉన్నారు.