Shivam Dube: చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మైదానంలో బాగా ఎంజాయ్ చేశా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivam Dube Says I know I can hit big sixes: మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉందని, అయినా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా అని టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబె తెలిపాడు. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించిందని, తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా అని చెప్పాడు. దూబె (60 నాటౌట్; 40 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ చేయడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతరం శివమ్ దూబె మాట్లాడుతూ… ‘మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉంది. అయినా బాగా ఎంజాయ్ చేశా. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురి కాలేదు. ఫీల్డింగ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడికి గురయ్యా. తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా. టీ20లలో ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు తెలుసు. భారీ సిక్స్‌లు కొట్టగలననే నమ్మకం నాకుంది. బౌలింగ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా’ అని చెప్పాడు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
Also Read: Novak Djokovic Cricket: క్రికెట్ ఆడిన టెన్నిస్ స్టార్ జకోవిచ్.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
రింకు సింగ్ మాట్లాడుతూ… ‘మొహాలీలో చలి పరిస్థితులను ఆస్వాదించాను. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కఠినంగా అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాక ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటు అయింది. ఆ స్థానంలో పరుగులు చేయడం ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఈసారి తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చింది. గతంలో ఎంఎస్ ధోనీతో చాలాసార్లు దీని గురించి చర్చించాను. బంతిని బట్టి బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాలని సూచించాడు. ఇప్పుడు అదే ఆచరిస్తున్నా’ అని తెలిపాడు.
Shivam Dube, The Star. 🇮🇳
– Dube won the Player of the match in his return match for India. pic.twitter.com/0IVsaGXxbC
— Johns. (@CricCrazyJohns) January 11, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!