NTV Telugu Site icon

Shivam Dube: చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మైదానంలో బాగా ఎంజాయ్‌ చేశా!

Shivam Dube

Shivam Dube

Shivam Dube Says I know I can hit big sixes: మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉందని, అయినా బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్‌ చేశా అని టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె తెలిపాడు. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించిందని, తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా అని చెప్పాడు. దూబె (60 నాటౌట్‌; 40 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీ చేయడంతో అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనంతరం శివమ్‌ దూబె మాట్లాడుతూ… ‘మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉంది. అయినా బాగా ఎంజాయ్‌ చేశా. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అసౌకర్యానికి గురి కాలేదు. ఫీల్డింగ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడికి గురయ్యా. తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా. టీ20లలో ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు తెలుసు. భారీ సిక్స్‌లు కొట్టగలననే నమ్మకం నాకుంది. బౌలింగ్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా’ అని చెప్పాడు.

Also Read: Novak Djokovic Cricket: క్రికెట్‌ ఆడిన టెన్నిస్‌ స్టార్ జకోవిచ్‌.. నవ్వులు పూయిస్తున్న వీడియో!

రింకు సింగ్ మాట్లాడుతూ… ‘మొహాలీలో చలి పరిస్థితులను ఆస్వాదించాను. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కఠినంగా అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాక ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం అలవాటు అయింది. ఆ స్థానంలో పరుగులు చేయడం ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఈసారి తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చింది. గతంలో ఎంఎస్ ధోనీతో చాలాసార్లు దీని గురించి చర్చించాను. బంతిని బట్టి బ్యాటింగ్‌లో మార్పులు చేసుకోవాలని సూచించాడు. ఇప్పుడు అదే ఆచరిస్తున్నా’ అని తెలిపాడు.