Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Afg India Vs Afghanistan 3rd T20 Preview Prediction And Playing 11

IND vs AFG: అఫ్గాన్‌తో మూడో టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను!

Published Date :January 17, 2024 , 9:18 am
By Sampath Kumar
IND vs AFG: అఫ్గాన్‌తో మూడో టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs AFG 3rd T20 Prediction: అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్‌ గెలుచుకున్న టీంఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్‌.. ఏ మేరకు పోటి ఇస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్‌ 2024 ముందు దూకుడే మంత్రంగా భారత్ సాగుతోంది. బెంగలూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఈ మ్యాచ్‌లో అయినా కెప్టెన్‌ రోహిత్ శర్మ పరుగులు అందుకోవాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన రోహిత్.. మూడో టీ20లో సత్తాచాటాలని జట్టు కోరుకుంటోంది. ఈ మ్యాచ్ తర్వాత అన్నీ ఐపీఎల్‌ మ్యాచ్‌లే ఉండటంతో.. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ గట్టి స్కోర్ చేసేందుకు ఈ మ్యాచ్‌ను సద్చేవినియోగం చేసుకోవాలి. మరోవైపు 14 నెలల విరామం తర్వాత టీ20 మ్యాచ్‌ ఆడిన విరాట్ కోహ్లీ 181 స్ట్రైక్‌రేట్‌తో 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. స్పిన్‌లో కాస్త నెమ్మదిగా ఆడే విరాట్.. ముజీబ్‌ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 7 బంతుల్లో 18 పరుగులు చేయడం విశేషం.

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

మూడో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వికెట్‌ కీపర్‌గా సంజు శాంసన్‌కు అవకాశమిస్తారా? అన్నది చూడాలి. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో నాలుగో టీ20లో అవకాశం దక్కించుకున్న జితేశ్‌ శర్మ వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతడి బదులు శాంసన్‌కు అవకాశం రావోచ్చు. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌ లేదా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశముంది. ఇక ముకేశ్‌ కుమార్‌ స్థానంలో అవేష్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు.

రషీద్‌ ఖాన్‌ లేక బలహీనంగా మారిన అఫ్గాన్‌.. ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గుర్బాజ్‌ పెద్దగా రాణించలేదు. ఈ సిరీస్‌లో అఫ్గాన్‌ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించినా.. సమష్టిగా గట్టిపోటీ ఇవ్వడంలో విఫలమైంది. మరి ఆఖరి మ్యాచ్‌లోనైనా అఫ్గాన్‌ పోటీ ఇస్తుందో చూడాలి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి పరుగుల వరద పారే అవకాశం ఉంది. కొత్త పిచ్‌పై మూడో టి20 మ్యాచ్‌ జరగనుంది. ఎప్పటిలా పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలే ఎక్కువ.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కోహ్లి, శివమ్‌ దూబె, జితేశ్‌ శర్మ, రింకు సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌/కుల్దీప్ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, ముకేశ్‌ కుమార్‌/అవేష్‌ ఖాన్‌.
అఫ్గానిస్థాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, గుల్బదీన్‌ నైబ్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబి, నజీబుల్లా జద్రాన్‌, కరీమ్‌ జనత్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs afg
  • IND vs AFG 3rd T20
  • IND vs AFG 3rd T20 Playing 11
  • IND vs AFG 3rd T20 Prediction
  • IND vs AFG 3rd T20 Preview

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions