IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- భారత్-అఫ్గానిస్థాన్ రెండో టీ20,
- ఢిల్లీలో మ్యాచ్, రాత్రి 7:30 గంటలకు ప్రారంభం,
- తొలి టీ20లో భారత్ ఘన విజయం,
- సిరీస్ 2-0తో కైవసం చేసుకోవడంపై టీమిండియా దృష్టి,
- సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కే ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (సెప్టెంబర్ 15) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మొదలుకానుంది. తొలి టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తొలి టీ20లో భారత్ కొన్ని విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ఐదో బౌలర్ విషయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాడన్నది కీలకంగా మారింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా పూర్తిస్థాయి ఫామ్‌లో ఉన్నట్లు కనిపించలేదు. మరోవైపు శివమ్ దూబే వేసిన చివరి ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసి పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. అతడితో ఒకటి కంటే ఎక్కువ ఓవర్లు వేయించగలమా అన్నది ప్రశ్నగానే ఉంది.
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
ఇక బ్యాటింగ్ విభాగంలో అందరి దృష్టి సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీపై ఉంది. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన వైభవ్‌కు అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే టీమ్ మేనేజ్మెంట్ సంజూపై మరోసారి నమ్మకం ఉంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనందుకు అనుభవజ్ఞుడైన సంజూను పక్కన పెట్టకుండా మరో అవకాశం ఇవ్వొచ్చని అంచనా.
మరోవైపు ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉండడంతో జట్టు బ్యాటింగ్ కాంబినేషన్‌పై మరింత ఆసక్తి నెలకొంది. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఎలాగూ కీలక పాత్ర పోషించనున్నారు. ఇక అఫ్గానిస్థాన్ విషయానికి వస్తే.. రహ్మానుల్లా గుర్బాజ్, సదిఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి పుంజుకుని సిరీస్‌ను సమం చేయాలని అఫ్గాన్ కూడా భావిస్తోంది.
భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంటుంది. దీంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా.? లేక సంజూ శాంసన్‌పైనే మరోసారి నమ్మకం ఉంచుతారా.? అన్నది టాస్ సమయంలో తేలనుంది.
టీమిండియా ప్లేయింగ్ XI:
సంజూ శాంసన్ / వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ XI:
సదిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్.
తాజావార్తలు
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!