IND Playing XI or 2nd Test vs WI: వెస్టిండీస్ పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. గురువారం (జులై 20) నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌లోనూ ఆతిథ్య వెస్టిండీస్‌పై గెలిచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు తొలి టెస్టులో కనీస పోటీ ఇవ్వలేక పోయిన వెస్టిండీస్.. రెండో టెస్ట్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. రెండో టెస్టులో రోహిత్ సేన ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండో టెస్టు నేపథ్యంలో భారత తుది జట్టును ఓసారి చూద్దాం.
తొలి టెస్ట్‌లో అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న అంచనాలకు మించి ఆడాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీతో సత్తా చాటాడు. దాంతో రెండో టెస్టులో కూడా వీరిద్దరూ ఓపెనింగ్ చేస్తారు. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. అయితే బెంచ్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే.. కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇవ్వనుంది. విండీస్ ఎలాగూ కనీస పోటీ కూడా ఇవ్వడం లేదు కాబట్టి గైక్వాడ్‌కు ఛాన్స్ (Ruturaj Gaikwad Replace Viat Kohli) ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.
Also Read: Gold Smuggling: శానిటరీ ప్యాడ్, అండర్‌వేర్‌లలో బంగారం.. అడ్డంగా దొరికిపోయిన మహిళ!
ఐదవ స్థానంలో అజింక్య రహానే ఆడతాడు. తొలి టెస్ట్‌లో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ తడబడినా అతనికి మరో అవకాశం ఇవ్వనుంది. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ ఆడతారు. మొహ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వికెట్ స్పిన్‌కు అనుకూలంగా కాబట్టి ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే జయదేవ్ ఉనద్కత్ బెంచ్‌కు పరిమితమవుతాడు. శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తాడు కాబట్టి తుది జట్టులో ఉండనున్నాడు.
భారత్ తుది జట్టు (IND Playing XI WI):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ/రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్/అక్షర్ పటేల్.
Also Read: IND vs WI: వెస్టిండీస్‌కు అజిత్ అగర్కార్.. ఎవరి కోసం?