Site icon NTV Telugu

YSRCP: వైసీపీ ఇంఛార్జీల మార్పుపై కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ

Ysrcp

Ysrcp

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది.. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు.. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. ఇక, రెండో విడత లిస్ట్‌ రెడీ అయ్యిందని.. రేపో మాపో లిస్ట్‌ వస్తుందనే చర్చ సాగుతోంది.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు..

Read Also: Mahesh Babu: న్యూయర్ వేడుకల కోసం దుబాయ్‏కు మహేష్… పిక్స్ వైరల్..

సీఎం కార్యాలయానికి వచ్చినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు కన్వీనర్ దేవినేని అవినాష్ తదితర నేతలు వెళ్లారు.. అయితే, కొంత మంది వివిధ పనులపై వస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో మార్పుల నేపథ్యంలో వీరి రాకకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read Also: AP DSC Notification: రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

మరోవైపు తాడేపల్లిలోని సీఎంవోకు వచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు పై సీఎంతో చర్చించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు వంటి సెగ్మెంట్లపై వైసీపీ అధిష్టానంతో బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరపనున్నారట.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే చర్చ సాగుతోంది.

Exit mobile version