NTV Telugu Site icon

Eatala Rajendar: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కేంద్రమంత్రులు..

Cherlapalli Railway Station

Cherlapalli Railway Station

Inauguration of Cherlapally Railway Station on 28th of this month.. Two Union Ministers to attend: మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విశాల ప్రదేశంలో ఏర్పాటు చేశామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కేంద్రం ముందుకు వచ్చి రైల్వే స్టేషన్‌కు రోడ్డు సౌకర్యం కల్పించి వేగవంతంగా పనులు పూర్తి చేసిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

Read Also: Minister Nimmala Rama Naidu: అన్నదాత‌ల అండ‌దండ‌ల‌న్నీ కూటమి ప్రభుత్వానికే.. మరోసారి రుజువైంది..

వారం రోజుల పాటు తమ నాయకత్వం అంతా కూడా రైల్వే అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్షించి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు ఎంపీ ఈటల తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్‌ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

Read Also: Minister Nadendla Manohar: సంక్రాంతి తర్వాత రోడ్ల నిర్మాణాలు ప్రారంభం

Show comments