Site icon NTV Telugu

Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి

Drag Horror Case

Drag Horror Case

Drag Horror: ఉత్తరప్రదేశ్‌లో లారీ బీభత్సం సృష్టించింది. తాత, మనవడు ప్రయాణిస్తున్న స్కూటీని ఓ లారీ సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఉదిత్ నారాయణ్ ఛాన్సోరియా (67), అతని మనవడు సాత్విక్(6) మార్కెట్‌కు వెళ్తుండగా, వారి స్కూటర్‌ను వేగంగా వచ్చిన డంపర్ ట్రక్ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఉదిత్ అక్కడికక్కడే మృతి చెందగా, సాత్విక్, ద్విచక్రవాహనం రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది.

Read Also: Earthquake: గుజరాత్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

ఈ ఘటన కాన్పూర్-సాగర్ హైవే ఎన్‌హెచ్‌-86పై జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ట్రక్కు సమీపంలోని అనేక బైక్‌లు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. పక్కనే ఉన్నవారు రోడ్డుపై రాళ్లు, బండరాళ్లు వేయడంతో చివరకు లారీ ఆగిపోయింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు.

Exit mobile version