NTV Telugu Site icon

UK Pensioner : ఏంట్రా ఇదీ.. తాత శవాన్ని ఫ్రిజ్ లో పెట్టి బ్యాంక్ కార్డులతో ఎంజాయ్

Uk

Uk

UK Pensioner : యూకేలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ప్రతి నెల పింఛన్ వస్తుండేది. సడన్ గా ఆ వ్యక్తి చనిపోవడంతో మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్లో ఉంచాడు. అతడికి ప్రతినెల బ్యాంకులో పడే పింఛన్ తో ఎంజాయ్ చేశాడు. డబ్బు కావాల్సినప్పుడల్లా అతడికి సంబంధించిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి తీసుకుని షాపింగ్ చేసేవాడు. ఏదైనా చాలా కాలం దాగదు కదా. దీంతో ఎలాగోలా విషయం బయటికి పొక్కడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు.

Read Also:Ayesha Meera Case: ఆయేషా మీరా కేసులో సత్యంబాబు కీలక వ్యాఖ్యలు..

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా.. యూకేకు చెందిన జాన్ వెయిన్ రైట్(71), డామియన్ జాన్సన్(52) ఓకే ఫ్లాట్ లో కలిసి జీవించేవారు. వీరిద్దరు హామ్ డౌన్ టౌన్ క్లీవ్ ల్యాండ్ టవర్, హోలీవెల్ హెడ్ లోని ఒక ఫ్లాట్ కలిసి ఉండేవారు. ఇద్దరిలో వెయిన్ రైట్ కు పెన్షన్ వస్తుండేది. ఉన్నట్లుండి ఆయన 2018 సెప్టెంబర్ లో చనిపోయాడు. ఈ విషయం అతడి రూమ్ మేట్ ప్రపంచానికి తెలియకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఫ్రీజర్ తీసుకొచ్చి, ఆ మృతదేహాన్ని అందులో భద్రపరిచాడు.

Read Also:Jana Reddy: భట్టి పాదయాత్ర.. కోమటిరెడ్డి విషయంపై స్పందించనన్న జానా

అనంతరం అతడి బ్యాంకు సంబంధించిన కార్డులను ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఏటీఎంల ద్వారా డబ్బును డ్రా చేసి షాపింగ్ చేసే వాడు. ఇలా రెండు ఏళ్ల పాటు జాన్ వెయిన్ రైట్ మరణించిన విషయం దాచి ఉంచాడు. 2020 ఆగస్టు 22వ తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టు తాజాగా అతడు చేసిన పనిపై తీర్పు ఇచ్చింది. కానీ డామియన్ జాన్సన్ కోర్టుకు వివరణ ఇస్తూ తాను షాపింగ్ చేసిన డబ్బు తనదేనని తెలిపాడు. తాము ఇద్దరం బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచామని, ఎప్పుడైనా ఆ డబ్బు ఉపయోగించుకునే అర్హత తనకే ఉందని చెప్పారు. జాన్సన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. కానీ వెయిన్ రైట్ ను చట్టబద్ధంగా, మర్యాదగా ఖననం చేయకుండా అడ్డుకున్నారనే అభియోగాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు తొలుత అతడిని దోషిగా తేల్చి.. అనంతరం బెయిల్ మంజూరు చేసింది.