NTV Telugu Site icon

Harshit Rana: చెలరేగిన హర్షిత్.. 6 బంతుల్లో 4 వికెట్లు

Rana

Rana

Harshit Rana PM’s XI vs Indians: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపధ్యంలో మొదటి మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తర్వాత మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడులో మొదలు కాబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ పింక్ బాల్ తో జరగబోతోంది. అయితే, మొదటి టెస్ట్ కు రెండు టెస్టుకు మధ్యలో సమయం ఎక్కువగా ఉండడంతో టీమిండియా కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో పింక్ బాల్ తో ప్రైమ్ మినిస్టర్ X1 టీంతో రెండు రోజుల వామప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా మొదటి రోజు వర్షం కారణంగా ఒక్క బాల్ పడకుండానే ముగిసిపోయింది. ఇక నేడు రెండో రోజు ఆటలో భాగంగా రెండు జట్లు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన ప్రైమ్ మినిస్టర్ జట్టు మొదట తన ప్రతాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేసింది. అయితే హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మొదట్లోనే వికెట్ తీసి ఆస్ట్రేలియా జట్టు స్పీడును తగ్గించాడు.

Also Read: IND vs AUS: రెండో టెస్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ కాదు.. ఏ స్థానంలో ఆడనున్నాడంటే..?

ఇకపోతే ఈ మ్యాచ్ లో యువర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా తన బౌలింగ్ ప్రతాపాన్ని చూపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ X1 జట్టుకు 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మూడో వికెట్ కోసం టీమిండియా బౌలర్లు చాలాసేపు కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో బౌలింగ్ అటాక్ లోకి వచ్చిన యువ బౌలర్ హర్షిత్ రాణా సంచనలాన్ని సృష్టించాడు. అతడు వేసిన వరుస ఓవర్లలో కేవలం ఆరు బంతులతో నాలుగు వికెట్లు తీసి టీమిండియాకు పునరాగామాన్ని అందించాడు.

Also Read: Rohith Sharma Son Name: ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ కొడుకు పేరును చెప్పేసిన రితికా సజ్దే..

ప్రైమ్ మినిస్టర్ జట్టు 124 పరుగులకు రెండు వికెట్లు నష్టపోయిన సమయంలో ఇన్నింగ్స్ 23వ ఓవర్ వేయడానికి వచ్చిన హర్షిత్ రానా నాలుగో బంతికి వికెట్ ను అందించాడు. ఆ తర్వాత చివరి బంతికి మరో వికెట్ ని కూడా అందించాడు. అంతటితో ఆగకుండా 25 ఓవర్ లో మరోసారి బౌలింగ్ కి వచ్చిన హర్షిత్ మొదటి బంతికే మరో వికెట్ తీశాడు. ఆ తర్వాత మరొక బంతి తర్వాత అంటే 25 ఓవర్ మూడో బండికి మరో వికెట్ తీయడంతో కేవలం 6 బంతులలో నాలుగు వికెట్లు తీసినట్లైంది. దాంతో ప్రైమ్ మినిస్టర్స్ X1 జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 133 చేసింది. ఇక చివరికి 43.2 ఓవర్లలలో 240 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇన్నింగ్స్ మొత్తంలో హర్షిత్ రానా 4 వికెట్లు, ఆకాష్ దీప్ 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు. ఇక ప్రైమ్ మినిస్టర్స్ జట్టులో శ్యామ్ 107 పరుగులతో సెంచరీని అందుకోగా, చివరిలో జాకోబ్స్ 61 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆపై జాక్ 40 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోర్ చేయగా మిగతావారు పెద్దగా పరుగులు చేయలేదు.