IND W vs SL W: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. మహిళల టి20 ప్రపంచ కప్ 2024లో భారత్, శ్రీలంక మధ్య ఈ మ్యాచ్ మంగళవారం (అక్టోబర్ 9)న జరుగుతుంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతకుముందు పాకిస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ అండ్ టీం ఈ మ్యాచ్‌లో విజయంతో తన నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపోతే ఇప్పటివరకు భారత్- శ్రీలంక జట్ల మధ్య 25 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత జట్టు 19 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక ఐదుసార్లు మాత్రమే విజయాన్ని దక్కించుకుంది. ఒక మ్యాచ్ లో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి ప్రత్యర్థులకు గట్టిపోటీని ఇవ్వడంలో భారత జట్టు సఫలమవుతుందని భావిస్తున్నారు.
Iran Israel War: హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. 50 మంది ఉగ్రవాదులు మృతి
న్యూజిలాండ్‌పై ఓటమితో టోర్నీని ప్రారంభించినప్పటికీ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి, తొలి విజయాన్ని అందుకోవడం ద్వారా భారత్ అద్భుతంగా పునరాగమనం చేసింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు చాలా కీలకం. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాకిస్థాన్‌పై రిటైర్డ్ హర్ట్ తీసుకున్న తర్వాత గాయం కారణంగా పెవిలియన్‌కు చేరుకుంది. అయితే., హర్మన్‌ప్రీత్ కౌర్ విషయంపై వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శ్రీలంకతో ఆడుతుందా లేదా అనే విషయంపై పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు విలేకరులతో మాట్లాడుతూ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చింది. ఆమె క్షేమంగా ఉందని, శ్రీలంకతో మ్యాచ్‌కి సిద్ధంగా ఉంటుందని చెప్పింది. అయితే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయిన ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఫిట్‌నెస్‌పై మాత్రం ఇంకా ఆందోళన నెలకొంది.
Basara: బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా మూలా నక్షత్ర వేడుకలు
ఇరు జట్లలో ప్లేయింగ్-11 ను ఇలా అంచనా వేయవచ్చు..
భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సంజన, అరుంధతీ రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్ ఠాకూర్.
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమ్రీ అటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని (Wk), సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధిని, ఇనోకా రణవీర.