Huge Fire Accident: మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రి చించ్‌వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో సదరు ప్రాంతంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసారు.
Fenugreek seeds: మెంతులు చూడడానికి అంతే ఉన్న తింటే మాత్రం బోలెడు ప్రయోజనాలు..
అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నగరంలోని మరికొన్ని ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు కృషి చేసారు. ఇక ఈ ఘటనలో అగ్నిమాపక చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే., ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ విషయాన్ని సదరు ప్రాంత పొలిసు అధికారులు తెలిపారు. ఇకపోతే అక్కడా ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని కలగకపోయినప్పటికీ.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇక ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
