NTV Telugu Site icon

Olympic Medals: ఒలింపిక్స్‭లో అందించే బంగారు పతకంలో ఎంత బంగారముంటుందో తెలుసా..?

Medals Olympics

Medals Olympics

Olympic Medals: ఒలింపిక్స్‌ లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడి మొదటి కల తన దేశానికి పతకం సాధించడం. ఈసారి కూడా జూలై 26 2024 నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో 208 దేశాల నుంచి 10,714 మంది అథ్లెట్లు పతకాలు సాధించాలని పోటీపడుతున్నారు. ఈసారి ఒలింపిక్స్‌ లో మొత్తం 5,084 పతకాలు అందుకోనున్నారు క్రీడాకారులు. అయితే, ఈ పతకాలు దేనితో తయారు చేయబడ్డాయి. అందులో ఎంత బంగారం, వెండి, కాంస్య (రాగి) ఉన్నాయన్న విషయాలను ఒకసారి చూద్దాం.

Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..

ఇకపోతే ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం కాదు. అయితే, ఈ పతకంలో కొంత మొత్తంలో బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం., బంగారు పతకాలు తప్పనిసరిగా కనీసం 92.5% వెండిని కలిగి ఉండాలి. అలాగే 6 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో పూత పూయాలి. అదేవిధంగా తక్కువ ఖర్చు కారణంగా వెండి పతకాలు పూర్తిగా వెండితో, కాంస్య పతకాలను స్వచ్ఛమైన కాంస్యం (రాగి)తో తయారు చేస్తారు. ఒలింపిక్ కమిటీ అన్ని పతకాల పరిమాణం, బరువును కూడా సెట్ చేసింది. దీని కింద పతకాల పరిమాణం 85 మి.మీ కాగా మందం 9.2 మి.మీ. గా ఉంటుంది. అదే విధంగా బంగారు పతకం మొత్తం బరువు 529 గ్రాములు, వెండి పతకం 525 గ్రాములు, కాంస్య పతకం బరువు 455 గ్రాములు. ఈసారి 19వ శతాబ్దపు చారిత్రక ప్రదేశం ఈఫిల్ టవర్ నుండి ఇనుప ముక్క కూడా పారిస్ ఒలింపిక్స్ పతకాలలో పొందుపరచబడుతుందని సమాచారం.

Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

1912 స్టాక్‌ హోమ్ ఒలింపిక్ క్రీడల్లో చివరిసారిగా అథ్లెట్లకు పూర్తిగా స్వర్ణంతో చేసిన పతకాలను అందించారు. 1896 ఒలింపిక్స్‌ లో మొదటి బహుమతి విజేతలకు రజత పతకాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే ఆ సమయంలో బంగారం కంటే వెండి ధర ఎక్కువగా ఉండేది.

Show comments