NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్‌లో 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సాధించిన అతిపెద్ద విజయం. విజయానికి నిర్దేశించిన 583 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో అద్భుత విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టామ్ బ్లండెల్ తన రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (100) సాధించాడు. అతని కెరీర్‌లో ఇది రెండో టెస్టు సెంచరీ. ఇకపోతే మ్యాచ్ లో ఇంగ్లండ్ బౌలర్లు న్యూజిలాండ్ జట్టును పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్, ఆలీ రాబిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.
Also Read: AUS vs IND: ఓవైపు మెన్స్.. మరోవైపు ఉమెన్స్.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా భారీ ఓటమి
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీ (123 పరుగులు) సహాయంతో ఇంగ్లండ్ మొత్తం 280 పరుగులు చేసింది. ఆ తర్వాత గస్ అట్కిన్సన్ హ్యాట్రిక్ కారణంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 125 పరుగులకు కుదించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో జో రూట్ సెంచరీ (106 పరుగులు) చేశాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం న్యూజిలాండ్‌కు సాధ్యపడలేదు. కివీస్ చివరి ఇన్నింగ్స్‌లో కేవలం 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించింది.
Also Read: IND vs BAN: ఆసియా కప్ ఫైనల్.. టీమిండియా లక్ష్యం 199
వెల్లింగ్టన్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. నిజానికి టెస్టు క్రికెట్ చరిత్రలో 5 లక్షల పరుగులు చేసిన తొలి దేశంగా ఇంగ్లండ్ నిలిచింది. 1877లో ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. మరోవైపు, 2008 తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌ను ఓడించింది. అంటే 16 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది.