NTV Telugu Site icon

Maname: ఏంటి భయ్యా.. ఒక్క సినిమాలో 16 పాటలు..

Maname

Maname

శనివారం ( june 1) శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్‌ ని రామ్ చరణ్ ఆన్‌లైన్‌లో లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించి టీమ్ ఓ గ్రాండ్ ఈవెంట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా గురించి సుదీర్ఘంగా మాట్లాడింది చిత్ర బృందం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సినిమాకు సమకూర్చారు. సినిమాలో మ్యూజిక్‌కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యను ఓ జర్నలిస్ట్ అడిగాడు.

Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..

అందుకు సమాధానంగా.. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ., ‘మనమే’ సినిమా ఓ సంగీత మహోత్సవం. సంగీతం సినిమాను నడిపిస్తుంది. మనమే సినిమాలో మొత్తం 16 పాటలు ఉండనుండగా., “హేషమ్ అబ్దుల్” సినిమాకు ఆత్మ. నా కెరీర్‌లో తొలిసారి రీరికార్డింగ్‌ కే ఎక్కువ సమయం కేటాయించాను. నేనేం అడిగినా దానిని హేషమ్ అందించాడు. అతనికి ఓపిక ఎక్కువ. ‘మనమే’ హేషమ్ అబ్దుల్ ఇప్పటి వరకు చేసిన అత్యుత్తమపని.

Illegal Sale of Ganja: గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు.. 1.57కిలోల సరుకు పట్టివేత

విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ లైట్‌ హార్టెడ్ ఎంటర్‌టైనర్‌ ను టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. జూన్ 7న మనమే సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చూడాలి మరి ఇన్ని పాటల మధ్య దర్శకుడు సినిమాను ఆవిధంగా ముందుకు తీసుకెళ్లాడో.