MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో బావను చంపిన ఘటన బద్వానీలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఒప్పించి ఇంటికి తీసుకురావాలని భర్త చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ భార్య వినడానికి సిద్ధంగా లేదు. గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటోంది. తన బావే భార్యను రెచ్చగొడుతున్నాడని భర్త అనుమానించాడు. ఈ కారణంగా అతను మొదట తన బావతో గొడవపడి, తర్వాత చంపాడు. హత్యకు గురైన యువకుడి పేరు నీలేష్. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితుడి పేరు జగన్.
Read Also:Tamilnadu: బీర్ ట్రక్కు బోల్తా.. మందుకోసం మనిషిని వదిలేశారు
బద్వానీ జిల్లా పతి గ్రామంలో యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో చనిపోయిన వ్యక్తి నీలేష్ అని తెలిసింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బావ, బామ్మర్ధులు ఇద్దరూ ఫాలియా గ్రామంలో ఓ పెళ్లికి వెళ్లారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో బావ నీలేష్ మద్యం మత్తులో ఉన్నాడు. దీంతో నిందితుడు జగన్ వాగు దగ్గరకు తీసుకెళ్లి హత్య చేశాడు. పోలీసుల విచారణలో జగన్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు జగన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
Read Also:DC vs GT: పోరాడి ఓడిన గుజరాత్.. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం
డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గత రెండు నెలలుగా జగన్ భార్య ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి సమయంలో అబ్బాయి అమ్మాయి కుటుంబానికి డబ్బు ఇస్తాడు. నిందితుడి కుటుంబీకులు ఈ డబ్బును మహిళ కుటుంబానికి ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ కోపంతో భార్య ఇంటికి వెళ్లిపోయింది. భార్యను తీసుకురావడానికి జగన్ చాలాసార్లు ప్రయత్నించినా ఆమె రాలేదు. దీంతో బావ నీలేష్ తన భార్యను రెచ్చగొడుతున్నాడని, అందుకే ఆమె రావడం లేదని జగన్ అనుమానించాడు.
