Loksabha 2024: తెలంగాణ ఎన్నికల బరిలో తెలుగు నటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అనేకచోట్ల కొందరు నటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తెలుగులో విడుదలైన పొలిమేర సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి నేడు నామినేషన్ దాఖలు చేసింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నామినేషన్ దాఖలు చేసింది. జిల్లా కలెక్టర్, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి శశాంక్ కు నామినేషన్ ను ఆవిడ సమర్పించింది. పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో సాహితి తన నటనలతో ఆకట్టుకుంది. పొలిమేర సిరీస్ లో మొదటి భాగంలో గెటప్ శీను భార్యగా, పొలిమేర 2 సీరిస్ లో రాజేష్ తో కలిసి నటించింది.
Also Read
- Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ఈ మధ్యకాలంలో ఆవిడ తన ఇంస్టాగ్రామ్ వేదికగా రాజకీయాల గురించి స్పందించింది. తాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని తెలిపింది. ఇదివరకు తన పోస్టులలో రీల్స్ చూసి పాటలకు పొలిటికల్ విషయాలని జత చేర్చవద్దని ఆవిడ కోరింది. ఇకపోతే ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం గాను కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి, బిజెపి పార్టీ తరపు నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. చూడాలి మరి ఈ తెలుగు నటి ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపగలదో.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!