NTV Telugu Site icon

Rape Case: ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. ఆపై కామానికి బలైన బాలిక..

Rape Case

Rape Case

Rape Case: కర్ణాటకలోని ఉడిపిలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆపై నిందితుడికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉడిపిలోని కర్కాలలో జరిగింది. ఇకపోతే బాధిత బాలికను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అల్తాఫ్ అనే యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తనను కలవాలని అల్తాఫ్ ఆ అమ్మాయిని పిలిచాడు. అనంతరం ఆ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Rohith Sharma: రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లైన ఇవ్వడానికి రెడీగా ఉన్న ఆ ఫ్రాంఛైజీలు..?

నేరం చేసిన తర్వాత నిందితుడు అల్తాఫ్ బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు వెళ్తున్నాడు. అదే సమయంలో స్థానిక హిందూ కార్యకర్తలు కారును ఆపారు. కారులో ఉన్న బాలిక మద్యం మత్తులో ఉండడం గ్రహించారు. దీంతో ఆగ్రహించిన హిందూ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికను ఆస్పత్రిలో చేర్చగా.. అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీని తరువాత, హిందూ కార్యకర్తలు పోలీసు స్టేషన్ బయట గుమిగూడి ఈ విషయంలో చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Cricket For Charity: వేలంలో రూ.40 లక్షలు పలికిన విరాట్ కోహ్లీ జెర్సీ.. ధోనీ, రోహిత్ బ్యాట్‌లు ఎంత రేట్ పలికాయంటే..?

కార్యకర్తల నిరసన అనంతరం బాధితురాలి తల్లిదండ్రుల వాంగ్మూలం మేరకు పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. అల్తాఫ్ తన ఇద్దరు స్నేహితుల సాయంతో బాలికకు మత్తు మందు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు బాలికను ఆమె ఇంటి దగ్గర దింపేందుకు వెళ్లాడు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్తాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడని, బీర్ బాటిల్, డ్రగ్స్ తీసుకురావడానికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని సమాచారం. అయితే, వారు అత్యాచారానికి పాల్పడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారిస్తారు.

Show comments