Assembly Elections: హరియాణా, జమ్మూకశ్మీర్ రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా హరియాణాలో బీజేపీ ముందుండగా, జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం ‘ఇండియా కూటమి’ వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగుతోంది. అయితే, రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తన ప్రాభవాన్ని మరింత విస్తరించుకోవాలని ఆశించగా.. నిరాశ తప్పలేదు.
Also read: Israel-Hezbollah: బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడులు.. హెజ్‌బొల్లా మరో కీలక నేత మృతి
జమ్మూ, హరియాణాలలో ఒక్క సీట్ కూడా ఆప్ ఖాతాలో తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నుంచి సవాల్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయని భావించవచ్చు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఆప్‌ని నిరాశపరచవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also read: Ashok Mali: ‘గర్బా కింగ్’ అశోక్ మాలీ ఇకలేరు.. ప్రదర్శన సమయంలో తీవ్రమైన గుండెపోటు(వీడియో)
హరియాణాలో మొదట కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే., సీట్ల పంపకంలో విభేదాలతో ఆప్ కాంగ్రెస్‌తో విభేదించింది. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ అన్ని స్థానాల్లో ఆప్ తన అభ్యర్థులను నిలబెట్టి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. దింతో ఆప్ పోటీ ఓట్ల విభజన ద్వారా ఎన్డీయే కూటమికి పరోక్షంగా లబ్ది చేకూర్చిందని విమర్శించారు. ప్రస్తుతం అందిన సమాచారం వరకు హర్యానా రాష్ట్రంలో బీజేపీ 49 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 35 స్థానాల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఇతరులు ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నేషనల్ కూటమి 52 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. భారతీయ జనతా పార్టీ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే ఇతరులు 12 స్థానాలలో ముందంజలో కొనసాగుతున్నారు.