NTV Telugu Site icon

IND vs AUS Test: పెర్త్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్‭లో ముందంజ

India Win

India Win

IND vs AUS Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లోని పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా 295 పరుగులతో విజయం సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచినా టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. అయితే టీమిండియా టాప్ బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసారు. దింతో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ను కాస్త స్లోగా మొదలు పెట్టిన టీమిండియా ఓపెనర్స్ కాస్త ఓపికగా ఆడుతూ.. మొదటి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇంకా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ను 6 వికెట్లు కోల్పోయి 487 పరుగులకు డిక్లెర్ చేసింది. ఈ ఇన్నింగ్స్ లో జైస్వాల్, విరాట్ కోహ్లీలు శతకాలు సాధించారు.

Also Read: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే

ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించడంతో ఆస్ట్రేలియాకు 533 పరుగుల భారీ లక్ష్యం వచ్చింది. ఈ నేపథ్యంలో మూడో రోజు చివరి సెషన్లో ఆట మొదలు పెట్టిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళింది. ఇక నాల్గొవ రోజు కూడా ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ వికెట్ల పర్మపరా కొనసాగింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటమెన్స్ ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారెలు టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్షా పెట్టారు. చివరికి టీమిండియా 295 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా మూడు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు.. నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా చెరో వికెట్ తీశారు. దింతో టీమిండియా సిరీస్ 1 – 0తో ముందంజలో ఉంది. ఇక డిసెంబర్ 6న రెండో టెస్టు పింక్ బాల్ టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది.

Also Read: Homemade Face Packs: చలికాలంలో మొహం మెరిసేలా ఉండాలంటే ఈ ఫేస్ ప్యాక్‌లని ట్రై చేయాల్సిందే