హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది.
Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు
ఇక జంట నగరలలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో గాలి ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక సిటీ మరో వైపు చూస్తే.. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, పాత బస్తీ, మలక్ పేట, నాంపల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్ ప్రాంతాల్లో కూడా ఎడతెరపి కూడిన వర్షం కురుస్తోంది. దింతో నగరంలోని అధికారులు అప్రమత్తయ్యారు. ముఖ్యంగా వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు.
Annamalai: తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..
గత రెండు మూడు రోజులుగా ఉదయంపూట వాతావరణం వేడిగా ఉన్న సాయంత్రం అయ్యేసరికి వరసలు కురుస్తున్నాయి. దీనితో నగర ప్రజలు కాస్త ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందుతున్నారు.
