Delhi Case: బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యతో ఒక్కసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడిన సంఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో భార్యా,భర్త, కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే, హత్య జరిగిన సమయంలో వాకింగ్ కు బయటికి వెళ్లిన కుమారుడు అర్జున్ బతికి ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అబ్బురపరిచే విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Mens Junior Hockey Championship: పాకిస్థాన్‌ను ఓడించి వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్
కుటుంబంలోని ముగ్గురి హత్యకు కారణం కుమారుడు అర్జున్ అని పోలీసులు నిర్ధారించారు. మొదట అతను బయటకి వాకింగ్ వెళ్లి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో ముగ్గురు హత్యకు గురి చేయబడ్డారని పోలీసులను నమ్మించే పని చేశాడు. అయితే, ఆ తర్వాత క్లూస్ టీం, ఇంకా పోలీసుల విషయాలను ఎలాంటి ఆధారాలు తెలియకపోవడంతో.. అలాగే అర్జున్ చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం రావడంతో కాసేపు గట్టిగానే ఎంక్వయిరీ చేశారు. దీంతో అసలు నిజాన్ని కుమారుడు అర్జున్ ఒప్పుకున్నాడు.
Also Read: France: అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని.. ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం
కుమారుడు అర్జున్ కు ఇంటి సభ్యులతో సరిగా సంబంధాలు లేవని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ ఆస్తిని తల్లిదండ్రులు కూతురు కవితకు రాసివ్వడం నచ్చని కుమారుడు చివరికి ఇలాంటి దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు నిందితుడు అర్జున్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అర్జున్ ఇంటి సభ్యులను అంతమొందించడానికి ఇంట్లోనే కత్తులను తీసుకొని మర్డర్ చేశారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అర్జున్ బిఏ రెండవ సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడు ఓ ప్రొఫెషనల్ బాక్సర్ కూడా. ఢిల్లీ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అతడు రజత పథకాన్ని కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం అర్జున్ పోలీస్ కస్టడీలో ఉండగా తదుపరి విచారణ కొనసాగుతోంది.
