Site icon NTV Telugu

MCD Polls Results: బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెర.. ఢిల్లీ మున్సి’పోల్స్‌’లో ఆప్‌దే హవా

Mcd Polls Results

Mcd Polls Results

MCD Polls Results: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించి తన మార్క్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 250 వార్డులకు గానూ మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 126 స్థానాల కన్నా ఎక్కువ వార్డులలో విజయం సాధించింది. బీజేపీకి ఎగ్జిట్‌ పోల్స్‌ ఘోర పరాభవం తప్పదు అని అంచనా వేసినా ఆప్‌కు కాస్త గట్టిగానే పోటీ ఇచ్చింది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా.. కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. 250 వార్డులు గల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈనెల 4న పోలింగ్ జరగగా 50.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

Supreme Court Mobile App 2.0: పెండింగ్‌ కేసులను ట్రాక్‌ చేసేందుకు ‘సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0’

దేశ రాజధానిలోని 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ఆప్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ పాలించింది. ఢిల్లీ వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 1,349 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమ్‍ఆద్మీ పార్టీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టు సాధించలేదు. 2017 ఎన్నికల్లో 270 వార్డులు ఉండగా బీజేపీ 181 సీట్లు గెలిచింది. ఆమ్‍ఆద్మీ 48 చోట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 30 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ పీఠం ఆమ్‍ఆద్మీ పార్టీకి తొలిసారి దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. అంచనాలకు తగ్గట్లుగానే ఆప్‌ తన విజయాన్ని నమోదు చేసింది.

Exit mobile version