Site icon NTV Telugu

G-20 Summit: బ్రెజిల్‌లో ప్రధాని మోడీకి సంస్కృత మంత్రాలతో ఘన స్వాగతం(వీడియో)

Modi

Modi

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(నవంబర్‌ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్‌తో పాటు భాగంగా నైజీరియా, గ్వామ్‌ దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. అయితే తాజాగా సోమవారం తెల్లవారు జామున ప్రధాని బ్రెజిల్‌కు చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మోడీకి అక్కడున్న భారత సంతతికి చెందిన జనాలు, బ్రెజిల్ అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. రియో డి జెనీరోలో ప్రధాని నరేంద్ర మోడీకి బ్రెజిల్ ప్రజలు సంస్కృత మంత్రాలతో స్వాగతం పలికారు. అందరూ కలిసి ఒకే సారి మంత్రోచ్ఛరణ చేయడం ఆకట్టుకుంది.

READ MORE: Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్‌.. అయ్యర్‌ సారథ్యంలో సూర్యకుమార్‌!

కాగా. జీ-20 సదస్సుకు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు హాజరుకానున్నారు. గతేడాది భారత్‌లో జీ-20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది. కాగా.. బ్రెజిల్‌ సందర్శన ముగించుకుని 19వ తేదీన ప్రధాని గయానాకు వెళ్లనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమద్‌ ఇర్ఫాన్‌ అలీ ఆహ్వానం మేరకు 21వ తేదీ వరకు అధికారిక పర్యటన కొనసాగనుంది. 17 ఏళ్లలో నైజీరియాలో, 1968 తర్వాత గయానాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోడీనే కావడం విశేషం.

Exit mobile version