NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: గేమ్ ఆడమంటే కొట్టుకుంటున్నారేంట్రా బాబు.. గౌతమ్, నిఖిల్ మధ్య రచ్చ రచ్చ

Bb8

Bb8

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ తగ్గి కొట్లాటలకు సంబంధించిన ఘటనలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగిన చార్జింగ్ టాస్క్ ను మళ్లీ తీసుకువచ్చారు. ఇదివరకు ఆ టాస్క్ చాలా ఫన్నీగా సాగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. ప్రస్తుతం మాత్రం ఆ టాస్క్ వల్ల ఓవర్ గా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లోని గౌతమ్, నిఖిల్ ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. వీరిద్దరూ ఏకంగా కొట్టుకోవడానికి రెడీ అయిపోయారు. గురువారం నాడు ఎపిసోడ్ లో ఓజి క్లాన్ టీం సభ్యులు ఎంతటికి చార్జింగ్ ఇవ్వకపోవడంతో ఎవరో ఒకరిని కిడ్నాప్ చేయాలని రాయల్ క్లాన్ టీం ప్లాన్ చేసింది. దీంతో మణికంఠను పట్టుకొని వారు ఓ రూంలోకి లాగేసారు. దీంతో నిఖిల్ తో పాటు ఓజి క్లాన్ మొత్తం అడ్డుపడింది. వారందరూ మణికంఠ కోసం పోరాడుతుండగా రాయల్ క్లాన్లో ఉన్న అవినాష్ మరోవైపు తెలివిగా యష్మిని లోపలికి లాగేసాడు. దాంతో వెంటనే టేస్టీ తేజ డోర్ మూసేశాడు. ఈ సమయంలో యష్మిని లోపల నుంచి బయటికి తీసుకోవచ్చేందుకు ఓజి సభ్యులు ప్రయత్నించగా చార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేశాడు అవినాష్. అయితే ఆ సమయంలో యష్మి కాస్త తెలివిగా వ్యవహరించి కేబుల్ తెంపేసి ఊడిపోయిందంటూ తెలపడంతో ఆమెను బయటకు వదిలేసారు.

Redmi A4 5G Price: క్రేజీ ఫీచర్స్, బిగ్ బ్యాటరీ.. 10 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్‌! ఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ఇదే

ఇకపోతే, ఆ తర్వాత మణికంఠ వాష్ రూమ్ వెళ్ళగా.. అక్కడకి వెనకాల విష్ణు ప్రియ వెళ్ళింది. దాంతో రాయల్ క్లాన్ సభ్యులు లోపలికి వెళ్లడంతో.. పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినందుకు తాను రెండు పాయింట్స్ చార్జింగ్ ఇస్తామంటూ నిఖిల్ డీల్ కుదిరించాడు. దీంతో మణికంఠ నుంచి బలవంతంగా ఛార్జ్ తీసుకోవడానికి ట్రై చేశారు రాయల్ క్లాన్ సభ్యులు. దీంతో వాష్ రూమ్ బయట ఉన్న టేస్టీ తేజను పక్కకు లాగేసాడు నిఖిల్. దాంతో వెనుక నుంచి గట్టిగా పట్టుకున్న గౌతమ్ ఆ తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో గౌతమ్ ను పక్కకు లాగేసాడు నబిల్. అయితే, ఈ గొడవలోకి మహబూబ్ ను రాకుండా పృథ్వి ముందే ఆపేసాడు.

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి షాక్.. 79 వేలకు చేరుకున్న బంగారం ధర! ఇక తగ్గేదేలే

గౌతం చేతులతో గుద్దుతున్నాడంటూ నబిల్ అనగా.. నేను తోయలేదు అంటూ గొడవ చేసాడు గౌతమ్. దాంతో కోపం తెచ్చుకున్న నిఖిల్, గౌతమ్ మెడను పట్టుకొని పక్కనే ఉన్న సోఫా పైకి తోసేసాడు. నిఖిల్ కొడితే నేను కొడతా అంటూ అరవడంతో.. తాను కొట్టలేదంటూ చెబుతూ కావాలని కొట్టలేదని గౌతం కాస్త గట్టిగా చెప్పాడు. దాంతో గార్డెన్ ఏరియాలో ఎక్కువ తక్కువ మాట్లాడకుండా అంటూ కొట్టుకున్నంత పని చేశారు.

Show comments