రోజూ తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ పుట్టగొడుగులను చేర్చడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. 

పుట్టగొడుగులు మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వీటిలో అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. 

పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 

మష్రూమ్స్‌ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి హాయపడతాయి. 

పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలు దూరమవుతాయి.

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. 

బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది. 

పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది. 

పుట్టగొడుగుల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది.