Site icon NTV Telugu

Godavari Water: భద్రాచలంలో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక..

Godavari Water

Godavari Water

ఎడతెరపిగా కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరుకుంది .ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రము మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద దీనికి తోడుగా దిగువన శబరి నదికి భారీగా వరదరావడంతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. ప్రస్తుతం 51 అడుగులు ఉండటంతో ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఒకవేళ వరద ఉదృతి 53 అడుగులకి చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం నుంచి వాజేడు వెంకటాపురంకి వెళ్లే రహదారులు నిలిచిపోయాయి.

Viral Video: లేడీ ఫ్యాన్‌కు క్షమాపణలు చెప్పిన కీరన్ పోలార్డ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ప్రధానమైన రహదారి మీదికి తూర్పు బాకు వద్ద రోడ్డుపై గోదావరి నీళ్లు నిల్చడంతో రాకపోకలకు యంత్రం ఏర్పడిందని సమాచారం. అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం, చింతూరు, వీఆర్ పురం వెళ్లే రహదారులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే శబరి నది స్పీడు మీద గోదావరి వరద ఆధార పడి వుంది. ప్రస్తుతం వున్న వరద నీటి ఫ్లో 53 నుంచి 55 అడుగుల వరకు గోదావరి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకి ఆదేశాలు చేశారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి గోదావరి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Viral Video: నడిరోడ్డుపై వింత పూజలతో రెచ్చిపోయిన మహిళ..

Exit mobile version