Site icon NTV Telugu

Acid Attack: 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్.. మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు

Acid

Acid

Acid Attack: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ లోని సెంటర్‌ పాయింట్‌లోని ఓ రెస్టారెంట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ తన మాజీ ప్రేమికుడిపై యాసిడ్ పోసింది. తన మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసి.. 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి కేకలు వేసింది. ఈ ఘటనలో అనేక అంశాలున్నాయని, విచారణ తర్వాతే చర్చిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మహిళను వర్ష, యువకుడిని వివేక్‌గా పోలీసులు గుర్తించారు.

Sabarimala: వారికి మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనం.. రోజుకు 80వేల మందికే దర్శనం

యువకుడు తన వివాహిత ప్రియురాలిని కలిసేందుకు అలీగఢ్‌ లోని రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇద్దరూ టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సడన్ గా ప్రియురాలు బ్యాగ్ లోంచి యాసిడ్ బాటిల్ తీసి ప్రియుడిపైకి విసిరింది. ఈ సమయంలో మహిళపై కొన్ని చుక్కల యాసిడ్ పడగా, మాజీ ప్రియుడిపై బాగానే యాసిడ్ దాడి జరిగింది. యువకుడి ముఖం, భుజాలు, ఛాతీ, రెండు చేతులు కాలిపోయాయి. చొక్కా కూడా కాలిపోవడంతో యువకుడు దానిని తీసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఘటన జరిగిన చాలా గంటల తర్వాత, అతను సస్నిగేట్ వద్ద ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విచారణలో యువతి యాసిడ్‌ పోసిందనే విషయాన్ని ఖండించాడు. నోయిడా నుంచి వస్తుండగా తనపై ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ పోశారని చెప్పారు.

Kolkata Doctor Case: ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన జూనియర్ డాక్టర్లు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాసిడ్‌ చల్లిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మహిళను విచారిస్తున్నారు. యాసిడ్ దాడికి పాల్పడిన యువతి, యువకుడు గత 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Exit mobile version