Imran Khan Arrest: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్తాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇమ్రాన్ అరెస్టుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దీంట్లో భాగంగా పాక్ లోని క్వెట్టాలో ఆందోళనకు హింసాత్మకంగా మారాయి. అక్కడ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. దీంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులను అదుపు చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also:Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం లక్ష్యం..
ఇమ్రాన్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పలు ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రతరం కావటంతో విద్యాసంస్థలను మూసివేశారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రపంచ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇమ్రాన్ ఖాన్ (#ImranKhan) అనే హ్యాష్‌ట్యాగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. తోషాఖానా కేసులో తనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఈ జమాన్ పార్కులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నివాసానికి చేరుకోక ముందే ఒక వీడియో రికార్డు చేశారు.
Read Also:Telangana Temple: కవిత కొండగట్టుకు.. ఇంద్రకరణ్ రెడ్డి భద్రాదికి..
అరెస్ట్ అనంతరం ఆయన పార్టీ అయితే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇమ్రాన్ ను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో పోలీసుల కంటే ముందే ఆయన నివాసానికి ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు పీటీఐ కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విదేశాల నుంచి ఇమ్రాన్ అందుకున్న ఖరీదైన బహుమతులను లాభాల కోసం విక్రయించారని బలమైన ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చోటు చేసుకుంది.
