Site icon NTV Telugu

CM Jagan’s Stone Pelting Case: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. వెలుగులోకి కీలక విషయాలు.. ఇంత జరిగిందా..?

Stone Pelting Case

Stone Pelting Case

CM Jagan’s Stone Pelting Case: విజయవాడలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.. సీఎం జగన్ పై దాడి ఒకసారి మిస్ కావటంతో రెండో సారి మిస్ కాకుండా సతీష్‌ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. డాబా కోట్ల సెంటర్ లో దాడికి సిద్ధమై రాయి తీసినా.. ఫ్రెండ్ ఆపడంతో పాటు పోలీసులు, తోపులాట ఉండటంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడట సతీష్‌.. ఆ తర్వాత 100 మీటర్ల దూరంలో ఉన్న వివేకానంద స్కూల్ ప్రహరీ పక్కన రోడ్ పై ఉన్న బెంచీ పక్కకు వెళ్లి రాయితో సతీష్‌ దాడి చేశారని చెబుతున్నారు.

Read Also: Vikas Raj: నామినేషన్లు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు..

ఇక, దాడి చేసిన వెంటనే వెనుక నుంచి ఒకరు సతీష్ ను పట్టుకోగా వదిలించుకుని అక్కడి నుంచి పారిపోయాడట.. సీఎం జగన్ పై దాడి చేయాలని అందుకు డబ్బు ఇస్తానని దుర్గారావు అనే వ్యక్తి చెప్పటంతో సతీష్‌ దాడికి పాల్పడ్డాడట.. దుర్గారావు ప్రస్తుతం టీడీపీ బీసీ సెల్ కార్యదర్శిగా ఉన్నారు.. మరోవైపు.. దాడి చేసిన తర్వాత డబ్బుల కోసం దుర్గారావుకు ఫోన్ చేశాడట సతీష్‌.. ఫోన్ ఒకసారి మాట్లాడి రెండోసారి ఫోన్ కట్ చేసిన దుర్గారావు.. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడని పేర్కొన్నారు.. దాడి అనంతరం 5 నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోయాడు సతీష్.. కాగా, రెండేళ్ల క్రితం సెల్ ఫోన్ దొంగతనం కేసులో సతీష్ అరెస్ట్‌ అయినట్టు పోలీసులు చెబుతున్నారు.. ఇక, 2018 వరకు జనసేన పార్టీలో ఉండి.. 2 నెలల క్రితం బోండా ఉమా అధ్వర్యంలో టీడీపీలో చేరారట దుర్గారావు.. మరోవైపు.. డాబా కోట్ల సెంటర్ దగ్గర సీఎం జగన్‌పై దాడి చేయవద్దని సతీష్‌ను అతడి స్నేహితుడు చిన దుర్గారావు వారించాడట.. ఈలోపు ర్యాలీ దగ్గరగా రావడంతో.. పోలీసులు తోసేయటంతో వివేకానంద స్కూల్ దగ్గరకు వెళ్లి సతీష్‌ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు పోలీసులు.

Exit mobile version