NTV Telugu Site icon

Durga Temple: దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు. భక్తుల కోసం ఇన్నీ సౌకర్యాలా..!

Temple

Temple

Durga Temple: విజయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు. ఆ ఖాళీలలో వారిని భర్తీ చేయాలని కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తామని అన్నారు. అంతేకాకుండా వాస్తు పరమైన ఇబ్బందులు లేకుండా మల్లిఖార్జున స్వామి మెట్ల దారిని పునరుద్ధరిస్తామని తెలిపారు. మల్లిఖార్జున స్వామి మెట్ల దారి మెటల్ డిటెక్టర్లు, పోలీసు బందోబస్తు పెడతామని సూచించారు.

Read Also: Alcohol: ఆల్కాహాల్ తాగే ముందు ఫుడ్ తినాలా..? తాగిన తర్వాత తినాలా..? ఏది బెటర్..?

మరోవైపు పంప్ హౌస్ దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని పార్కింగ్ కు వినియోగించే ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు అన్నారు. 300 రూపాయల దర్శనానికి ఒక లడ్డు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. అందుకు
భక్తులకు కనిపించేలా టోల్ ఫ్రీ నంబర్ల బోర్డులు పెడతామని.. అంతేకాకుండా కేశఖండన శాలలో వచ్చే ఫిర్యాదులు పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన వధూవరులకు అమ్మవారి ఆశీస్సులు అందేలా కుంకుమ, అక్షింతలు ఇస్తామని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేయాలని తీర్మానించామన్నారు. అంతేకాకుండా రెండు ఉచిత బస్సులు 3వ తారీఖున ఫ్రీ సర్వీసు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు 3వ తారీఖున ఉచిత చెప్పుల స్టాండు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Read Also: Minister Kottu Satyanarayana: పవన్ కల్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు

త్వరలో కుంకుమ ప్రసాదం ప్రతీ సామాన్య భక్తులకు అందిస్తామని దుర్గగుడి చైర్మన్ తెలిపారు. దుర్గా ఘాట్ లో సౌకర్యాల ఏర్పాటు, చెత్త తొలగింపులకు 24లక్షలకి టెండరు సిద్ధమైందని అన్నారు. మరోవైపు శుక్ర, శని, ఆది వారాలలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అన్న ప్రసాదం రాత్రి పూట కూడా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్యాటరీ వాహనాలు ఘట్ రోడ్డు, కనకదుర్గా నగర్ వైపు పెట్టడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు.