Site icon NTV Telugu

Ganesh Immersion : గ్రేటర్ పరిధిలో లక్ష 2 వేల 510 వినాయకుల నిమజ్జనం

Ganesh Immersion

Ganesh Immersion

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణనాథుల నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. బుధవారం ఉదయానికల్లా నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేష్ మండపాల నుంచి తమ వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు..

Jeevan Reddy: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ఆరంభించడం హర్షనీయం

Exit mobile version