Site icon NTV Telugu

IMD Weather Report: రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక..!

Weather Report

Weather Report

IMD Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశలో పయనించి, నేటి అర్థరాత్రి తర్వాత వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.

Pakistan Tomato Prices: దాయాది దేశంలో టమాటా మంటలు .. పాకిస్థాన్‌లో కిలో రూ.600-700!

ఇందులో భాగంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ప్రకాశం, కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, అలాగే కర్నూలు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ అల్పపీడనం దెబ్బకు తీరం వెంబడి గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఈ నెల 23, 24 తేదీల్లో గాలుల వేగం 50 నుండి 60 కిలోమీటర్లకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా సముద్రం అలజడి ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారాలు హెచ్చరికలు జారీ చేశారు. గడచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యల్పంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

నెవ్వర్ బిఫోర్.. రూ.29,000 భారీ డిస్కౌంట్ తో Samsung Galaxy S24 FE 5G మొబైల్ అమ్మకాలు..!

Exit mobile version