NTV Telugu Site icon

Weather Update: పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం..!

Rain Alert

Rain Alert

Weather Update: దేశంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో జోరు వర్షం కురుస్తుంది. తూర్పు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శుక్రవారం రుతుపవనాలు చురుకుగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారతదేశంలో కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ, యుపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి.

Read Also: Anurag Thakur: “ద్వేషానికి మెగా మాల్”.. ఇండియా కూటమిపై మంత్రి విమర్శలు..

ఢిల్లీ NCR లో ఉదయం నుండి వర్షం పడుతుంది. దీంతో అక్కడ వాతావరణం చల్లగా మారిపోయింది. గత 24 గంటల్లో ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 106 పాయింట్ల వద్ద నమోదైంది. ఇదిలా ఉంటే.. వారం నుంచి యూపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో చాలా చోట్ల విధ్వంసం సృష్టించాయి. లక్నో, బారాబంకి, మొరాదాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈరోజు కూడా యూపీలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: Krithi Shetty: మెగా ఇంటికి కోడలు కాబోతున్న బేబమ్మ.. ఏం మాట్లాడుతున్నార్రా..?

ఇక రాజస్థాన్ లో కూడా.. గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. కోట, ఉదయ్‌పూర్‌లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు.. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.