Site icon NTV Telugu

Rain Alert: రానున్న 48 గంటల్లో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Telangana Wether

Telangana Wether

Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి తమిళనాడు, ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నెల 16 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున బుధ, గురువారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రానున్న రెండు రోజుల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా గంటకు 60 కి.మీ. మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు నగరాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
Atlee : ఆ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అట్లీ..

Exit mobile version