Atlee : ఆ బిగ్గెస్ట్ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అట్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాయి. అన్ని భాషల్లో విడుదల అయ్యి బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి రావడంతో మన హీరోలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.అలాగే టాలెంట్ ఉన్న దర్శకులు హీరోలతో పని చేయడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారు.దీనితో మల్టీస్టారర్ మూవీస్ కి మంచి క్రేజ్ వస్తుంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు.. అలాగే తమిళ్ హీరోలు తెలుగు దర్శకులతో పని చేస్తున్నారు. అటు బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు.రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
సౌత్ స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అట్లీ రీసెంట్ గా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తో చేసిన జవాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..ఈ సినిమా లో షారుఖ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమా లో విజయ్ సేతుపతి విలన్ గా నటించి మెప్పించారు..సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అట్లీ ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు.దళపతి విజయ్, షారుఖ్ ఖాన్ తో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నాడు అట్లీ. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి.. తాజాగా ఈ మల్టీ స్టారర్ పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు అట్లీ. సోమవారం రోజున ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ విజయ్,షారుక్ మల్టీస్టారర్ గురించి తెలిపారు.. అట్లీ మాట్లాడుతూ.. జవాన్ షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో విజయ్ అక్కడికి వచ్చారు. షారుక్ , విజయ్ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత షారుక్ మా ఇద్దరితో కలిపి ఏదైనా చేయాలంటే చెప్పు మేము కచ్చితంగా చేస్తాం అన్నారు. విజయ్ కూడా దానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. బహుశా అదే నా తరువాత సినిమా అవ్వొచ్చు అని అన్నారు అట్లీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
తాజావార్తలు
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!