Site icon NTV Telugu

Weather Update: తీరం దాటిన వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో వర్ష సూచనలు..!

Weather Update

Weather Update

Weather Update: రాష్ట్ర వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ – దక్షిణ ఛత్తీస్‌గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగనున్నట్లు కూడా హెచ్చరిక జారీ చేశారు.

Read Also: Tirumala Darshanam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం..!

సముద్రంలో గాలుల వేగం పెరగవచ్చని, కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లకూడదని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఇకపోతే, ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత విస్తృతంగా పడే అవకాశం ఉందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇది ఇలా ఉండగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీనితో రాష్ట్రంలోని గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ఇప్పటికే వర్షలపై రాష్ట్రంలోని పలు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. అందుకు తగ్గట్టుగా సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

Read Also: Arshdeep Singh: తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన యువ క్రికెటర్..

Exit mobile version