NTV Telugu Site icon

Biparjoy Cyclone: తీర ప్రాంతాలకు IMD రెడ్ అలర్ట్.. 37 వేల మంది తరలింపు

Biparjoy Cyclone

Biparjoy Cyclone

బిపర్ జోయ్ తుఫాను నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు బిపర్ జోయ్ తుఫాన్ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తుఫాన్ ఈశాన్య దిశగా ప్రయాణించి రేపు సాయంత్రానికి జాఖౌ పోర్టు సమీపంలో మాండ్వి, కరాచీ మధ్య సౌరాష్ట్ర, కచ్, దానిని ఆనుకుని ఉన్న పాకిస్తాన్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాజ్ కోట్ లో సురక్షితం కాదని ప్రకటించిన రిలే టవర్ ను బిపర్ జోయ్ తుఫాను కారణంగా కూల్చిశారు.

Also Read : CM KCR: మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా డాక్టర్ల ముందు చేయి చూపాల్సిందే

దీంతో బిపర్ జోయ్ తుఫాన్ పై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్ లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. మరోవైపు బిపర్జోయ్ తుఫాను నేపథ్యంలో పశ్చిమ రైల్వే గుజరాత్-ముంబ‌యి మధ్య న‌డిచే పలు రైళ్లను క్యాన్సిల్ చేసింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తుఫాన్ తీరం దాటనుంది.

Also Read : Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!

పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంద‌ని వెదర్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం చెప్పింది. తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read : Upasana konidela :పుట్టబోయే బిడ్డ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన?

అరేబియా సముద్రం, బలూచిస్థాన్ తీర ప్రాంతంలో బిపర్ జోయ్ తుఫాన్ బీభత్సం కొన‌సాగుతోంది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను ప్రభావం కొనసాగుతుండటం, మక్రాన్ బెల్ట్ సమీపిస్తుండటంతో బలూచిస్థాన్ ప్రభుత్వం ఆ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది.