Heavy Rain Forecast: బంగాళాఖాతంలో ఈరోజు ఏర్పడిన అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అలాగే, రాయలసీమ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఏపీలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది.
Read Also: Nitish Kumar: నితీష్‌కుమార్‌కు భారతరత్న డిమాండ్.. బీహార్‌లో వెలసిన పోస్టర్లు
ఇక, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సంగారెడ్డి, మెదక్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Also: GTRI: చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తత.. భారత్‌కు బంపర్ అవకాశం..!
ఇక, ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అలర్ట్ చేశారు. అలాగే, సోమవారం నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.