NTV Telugu Site icon

IMD Alert: తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

New Project (3)

New Project (3)

IMD Alert: రానున్న మూడు రోజుల్లో తమిళనాడులోని 18కి పైగా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా తమిళనాడులోని 18 జిల్లాలకు పైగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఒక ప్రకటనలో తెలిపింది. కన్యాకుమారిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు తమిళనాడులోని తిరునెల్వేలి, తెన్కాసి, తేని జిల్లాల్లో రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, మధురై, దిండిగల్, తిరుపూర్, కోయంబత్తూరు, నీలగిరి, తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్ జిల్లాల్లో వర్ష హెచ్చరిక జారీ చేయబడింది.

Read Also: Ram Charan: గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…

నవంబర్ 22న తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు, కారైకల్ ప్రాంతంలోని రామనాథపురం, తూత్తుకుడి, తేని, దిండిగల్, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Read Also: Minister KTR: నేడు నాలుగు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..

చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న కాంచీపురం జిల్లాలో ఒక మోస్తరు ఎండలు ఉంటాయి. వెంటనే అకస్మాత్తుగా చీకటి మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. చివరికి భారీ వర్షం కురిసింది. కాంచీపురంతో పాటు వాలాజాబాద్, ఉతిరమేరూర్, చెన్నై బెంగళూరు జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లో ఈరోజు 30 నిమిషాలకు పైగా భారీ వర్షం కురిసిందని చెన్నై ఆర్‌ఎంసి తెలిపింది. నవంబర్ 22, 23 తేదీలలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే నాగపట్నం, కాంచీపురం,చెంగల్ పట్టు జిల్లాల్లోని స్కూల్స్ కు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.