NTV Telugu Site icon

Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్

Vijayasai Reddy

Vijayasai Reddy

సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈఎక్స్ 200 సామర్థ్యం గల బ్రేకర్, బకెట్ యంత్రాలతో బీచ్‌లో నిర్మించిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను సుమారు 10 అడుగుల భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగిస్తున్నారు.

READ MORE: Fire Accident : కోకాపేట GAR బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. కొందరి పరిస్థితి విషమం

ఇదిలా ఉండగ.. భీమిలి బీచ్‌ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్‌ పీఎల్‌వీఎన్‌ మూర్తి యాదవ్‌ గతంలో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. భీమునిపట్నం (భీమిలి) సీఆర్‌జడ్‌ జోన్‌ పరిధిలో శాశ్వత రెస్ట్రోబార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికికి ప్రమాదం పొంచి ఉందంటూ గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు మరో పిల్‌ వేశారు. గతంలో ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. సీఆర్‌జడ్‌ పరిధి నిర్ణయించి, అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది.

READ MORE: Ambati Rambabu: జగన్ కమిడియన్ అయితే.. మరి నువ్వేంటి నాగబాబు?