గోవా బ్యూటీ ఇలియానకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.. అందుకు కారణం ఆమె గర్భవతి కావడమే.. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ.. గత కొన్ని రోజులుగా దీనిపై ఓ రేంజులో చర్చలు జరుగుతూనే ఉన్నాయి..
ఇక ఇలియానా కూడా కడుపుకు కారణం ఎవరని ఎన్ని అడిగినా చెప్పకుండ తన గర్భం గురించి.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది..అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం వెల్లడించలేదు.. దీంతో అతని పేరు బ్యాగ్రౌండ్ గురించి చెప్పమని నెటిజన్లు చెబుతున్నారు..
కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది.. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ మొహాన్ని రివిల్ చేసింది.. దీంతో అతను ఎవరా అని నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..