Site icon NTV Telugu

Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే

Vijay Devarakonda Rashmika

Vijay Devarakonda Rashmika

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్ – రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

 Also Read : Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ.. వాస్తవం ఇదే

ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగిసిన తర్వాత, నూతన దంపతులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఎత్తున వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయని మంచి రోజు చూసి అందరికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ పెళ్లి వార్తలపై అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ స్పందించలేదు. అయినప్పటికీ, తేదీలు మరియు వేదికల వివరాలతో సహా వార్తలు వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు .

Exit mobile version