NTV Telugu Site icon

Vikarabad: వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్.. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులపై ఐజీ షనవాజ్ ఖాసీం ఆరా

Vikarabad

Vikarabad

వికారాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్ జిల్లాతో పాటు సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అదే విధంగా భద్రాద్రి, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, ఖమ్మం, సూర్యపేట, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. అయితే ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పాటు వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Read Also: Vasireddy Padma: పవన్‌ కళ్యాణ్ దత్తపుత్రుడే కాదు విష పుత్రుడు

దీంతో విద్యార్థులకు రేపు ( శుక్రవారం) తెలంగాణ వ్యాప్తంగా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. అయితే, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సైతం జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారి మండలాల్లో ఉదృత్తంగా ప్రవహించే వాగుల దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుంచి ప్రజలను స్కూల్ లేదా, గ్రామ పంచాయతీ ఆఫీస్ ల్లోకి తరలించాలని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో ట్రెక్కింగ్ ను కూడా అధికారులు నిలిపి వేశారు.

Read Also: Vanama Venkateshwar Rao: వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు మరోసారి షాక్

పర్మిషన్ లేకుండా అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని అటవిశాఖ అధికారులు సూచించారు. జిల్లాలో ప్రతి వాగు ఉదృత్తంగా ప్రవహిస్తుంది. కాగా, వికారాబాద్ లోని మూసీనదితో పాటు కాగ్నానది, కోట్ పల్లి ప్రాజెక్ట్, సర్పన్ పల్లి, నంది వాగు ప్రాజెక్టుల నీరు అలుగు పారి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన హైదరాబాద్ రేంజ్ ఐజీ షనవాజ్ ఖాసీం, జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో కలిసి కోట్ పల్లి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ధారూర్ సమీపంలోని నాగ సముందర్ వద్ద రాక పోకలు నిలిచిపోవడంతో అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.