NTV Telugu Site icon

Weight Loss : త్వరగా బరువు తగ్గాలంటే వీటిని రోజూ తినాల్సిందే..

Weight Loss

Weight Loss

బరువు తగ్గడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ అయ్యింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అధికబరువును కలిగి ఉంటారు.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం అధిక బరువేనని నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని అనుకొనేవారు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.. ఎటువంటి వాటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గాలని అనుకొనేవారు కొర్రలు, అరికెలు వంటి వాటిని మీ డైట్ లో చేర్చుకోవాలి.. ఇక అధిక ఫైబర్ ఉండే ధాన్యాలల్లో బార్లీ కూడా ఒకటి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.ఒక కప్పు బార్లీలో 193 క్యాలరీల శక్తి ఉంటుంది. సూప్ వంటి వాటి తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. చిరు ధాన్యాలలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి.. కొర్రల్లో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే వీటిని అన్నంకు బదులుగా వాడుకోవచ్చు..

జొన్నలల్లో తక్కువ క్యాలరీల శక్తిని కలిగి ఉంటుంది.. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు జొన్నలతో అన్నం, సంగటి, జావ వంటి వాటిని తయారు చేసి తీసుకోవచ్చు.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు దూరం అవుతాయి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త్వరగా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.. ఇంకా అనేక రకాల సమస్యలు తగ్గిపోతాయి.. బరువు తగ్గాలని అనుకొనేవారు వీటిని తప్పక మీ డైట్ లో చేర్చుకోవాలి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.