NTV Telugu Site icon

Viral Video: ఈ వీడియో చూస్తే బార్బర్ షాపుకు వెళ్లడానికే భయపడుతారు.. బూట్లు, చెప్పులతో కొట్టుకుంటూ..!

Barber

Barber

ఒక బార్బర్​ వెరైటీగా హెయిర్​మసాజ్ ​చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా మనం బార్బర్ షాపుకు వెళ్తే బార్బర్ ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే తమ గిరాకీ దెబ్బతినకుండా ఉండటానికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తాడు. కానీ ఈ బార్బర్ షాపులో హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లపై బార్బర్ ప్రవర్తించే తీరు చేస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఆ బార్బర్ చేయడమే అలా చేస్తాడా.. లేదంటే సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం చేస్తున్నాడా అనేది తెలియదు. ఈ వీడియో చూశాక మీరు బార్బర్ షాపుకు పోవడానికే భయపడుతారు.

Pakistan: పాక్‌లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం.. ఈ ఏడాది 18 మంది ఖతం..

ఈ వీడియోలో.. సెలూన్‌కు హెయిర్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చిన ఇద్దరు కస్టమర్లను చూడవచ్చు. ఓ సూటు, కళ్లజోడు పెట్టుకుని వచ్చిన బార్బర్ మసాజ్ చేయడానికి బదులు వారిపై ఏదో కోపం ఉన్నట్లు ఎడాపెడా కొట్టేస్తున్నాడు. అది కూడా చెంపలు, తలమీద తనకు బలమున్నంత బాదేస్తున్నాడు. పక్కనే ఉన్న మరో కస్టమర్ పై కూడా ఏకంగా బూటుతో కొడుతూ ఉన్నాడు. అలా ప్రవర్తిస్తున్న బార్బర్ ను చూసిన అక్కడి వారందరూ తెగ నవ్వేస్తున్నారు. అయితే ఈ వీడియో కేవలం సరదా కోసమే చేసినట్లుగా అనిపిస్తుంది. లేదంటే నిజంగానే బార్బర్ అలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా.. పెద్ద రచ్చరచ్చ అవుతుంది. కానీ మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వుకోక తప్పరు.

Chhattisgarh: ఎన్నికల వేళ.. సుకుమాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారుడు.. ఇందులో తమాషా ఏమీ లేదు అని అన్నాడు. మరో వినియోగదారుడు ఈ బార్బర్ ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అని తెలిపాడు. మరో వినియోగదారుడు.. తల వెనుక భాగంలో ఇలా కొట్టకూడదు అని కామెంట్ చేశాడు.