Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లల్లో కూడా ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. 2020 గణాంకాల ప్రకారం, ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 3.9 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు. ఊబకాయం కారణంగా మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్య, మెదడు సమస్య వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఊబకాయాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.
చలి, వేసవికాలం రోజుల్లో ప్రజలు ఎక్కువగా తింటారు. దీనిని సకాలంలో పరిష్కరించకపోతే శరీరంలో కొవ్వు పెరిగి చుట్టుకొలతో తేడా వస్తుంది. అందుకే ఏయే ఆహారాల వల్ల అధిక బరువు పెరుగుతారో తెలుసుకోవాలి. ఆ ఆహారంపై తగినంత శ్రద్ధ వహించాలి. సాధారణంగా కేలరీలు అధికంగా ఉండే ఆహారాలు ఊబకాయాన్ని మరింత పెంచుతాయి. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే అధిక కేలరీల ఆహారాలను కూడా ముట్టుకోకపోవడమే మంచిది. లేకపోతే ఊబకాయం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
Read Also : Banana : అరటిపండు తినేముందు ఒక్కసారి ఆలోచించుకోండి
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అవి మనకు పోషకాలను అందిస్తాయి. అయితే కొన్ని పండ్లను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగి.. ఊబకాయం ఏర్పడవచ్చు.
ఆరెంజ్ జ్యూస్ : మీరు ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే.. ఎక్కువగా పండ్ల రసాలను తాగకూడదు. నారింజ శరీరంలోని చక్కెరను అంటే కార్బోహైడ్రేట్లను పెంచుతుంది.
స్ట్రాబెర్రీ జ్యూస్ : ఊబకాయంతో బాధపడుతుంటే స్ట్రాబెర్రీ జ్యూస్ వైపు కూడా చూడకండి. ఎందుకంటే స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. స్ట్రాబెర్రీ జ్యూస్ వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అయితే ఫైబర్ అధికమైతే.. ఊబకాయాన్ని పెంచుతుంది.
మామిడి : మామిడిని ఇష్టపడని వారుండరు. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ఇంటింటా మామిడికాయలు విరివిగా రానున్నాయి. అయితే ఊబకాయంతో బాధపడే వారికి మామిడికాయ రసం తీసుకోకూడదు. ఊబకాయాన్ని తగ్గించడంలో మామిడి చాలా హానికరం. అది ఊబకాయాన్ని మరింత పెంచుతుంది. మామిడి పండ్లలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే బ్లడ్ షుగర్ సమస్య ఉన్న రోగులు మామిడిని ఎక్కువగా తినకూడదు.
అరటిపండ్లు : సన్నగా ఉన్నవారు అరటిపండ్లు తినాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. ఈ విషయం నిజం. అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారు. అరటి చాలా ఆరోగ్యకరమైన పండు. అరటిపండులో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. రోజుకు రెండు అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారు. కాబట్టి ఊబకాయం ఉన్నవారు అరటిపండు తినకూడదు.
అవకాడో : అవకాడో కూడా అధిక కేలరీల పండు. ఇది అనేక వ్యాధి-పోరాట శక్తులను కలిగి ఉంది. అయితే అవకాడోలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే ఊబకాయంతో బాధపడేవారు అవకాడో తినకూడదు.