కుత్బుల్లాపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతా మహేదర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గురువారం నాడు కుత్బుల్లాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి అభివృద్ధి జరగాలంటే సునీతారెడ్డి ఎంపీగా విజయం సాధించాలని అన్నారు. 2018లో కేసీఆర్ కక్ష గట్టి.. కొండగల్ ఇంట్లో ఉన్న తనని అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి పోలీస్ స్టేషన్ లో బంధించి ఓడగొట్టాడు.. కానీ, 3 నెలలు తిరిగే లోపు.. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దించెతే మూడు రంగుల జెండా పట్టుకొని గెలిచానని అన్నారు.
Read Also: Monditoka Jaganmohan Rao: మా పథకాలనే టీడీపీ కాపీ కొట్టింది..
అలాగే, ప్రశ్నించి గొంతుక కాబట్టే సీపీఎం, ప్రొఫెసర్ కోదండ రామ్ దగ్గరుండి నన్ను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి ప్రజలు ఇచ్చిన అధికారంతో రెండున్నర ఏళ్ల పాటు ప్రజల మధ్యనే ఉన్నాను అని ఆయన చెప్పారు. రోజుకు 18 గంటలు ప్రజా క్షేత్రంలోనే ఉన్నాను.. తన పోరాటం చూసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం కట్టబెట్టారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.