Secret Superstar: 15 కోట్లతో తీస్తే.. 858 కోట్లు రాబట్టింది.. ఇండియాలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secret Superstar: ఇటీవల కాలంలో చిన్న సినిమాలే పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. పెట్టిన పెట్టుబడికంటే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతలను ఆదుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. విశేషమేమిటంటే ఈ సినిమాకు ఇండియాలో పెద్దగా ఆదరణ పొందలేదు.. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు బాగా నచ్చింది. 15 కోట్లతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రంలో 19 ఏళ్ల యువ నటి ప్రధాన పాత్ర పోషించింది. ఇంత భారీ వసూళ్లను రాబట్టిన సినిమా తర్వాత.. ఆమె కొన్నాళ్లకే బాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పేసింది.
కొన్ని బాలీవుడ్ సినిమాల కథలు నిజమైన సంఘటనల ఆధారంగా ఉంటాయి. దీంతో సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ఆడుతుందా లేదా అనేది ముందుగా చెప్పలేం. గత కొన్నేళ్లుగా సినిమాల పట్ల ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. దీంతో సినిమాల కోసం కోట్లలో పెట్టుబడి పెట్టినా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. కానీ.. 15 కోట్లతో తీసిన సినిమా ఖర్చు కంటే 12-14 రెట్లు సంపాదించింది.
Also Read
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Big Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ముంచుకొస్తున్న మరో తుఫాన్ ముప్పు..
Read Also:Health Department: వెంటనే విధుల్లో చేరండి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఎన్నో సూపర్‌హిట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హీరో ఆ సినిమాలో ఉన్నారు. ఆయన మరెవరో కాదు.. అమీర్ ఖాన్. ఆ సినిమానే ‘సీక్రెట్ సూపర్ స్టార్’. కిరణ్‌రావు, అమీర్ ఖాన్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో జైరా వాసిమ్ తన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. సీక్రెట్ సూపర్ స్టార్ భారతదేశంలో 19 అక్టోబర్ 2017న విడుదలైంది. మొత్తం 62 కోట్లు రాబట్టింది. తర్వాత ‘సీక్రెట్ సూపర్ స్టార్’ జనవరి 19న చైనాలో విడుదలైంది. ఎక్కడ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందంటే.. అక్కడ ఇండియా కంటే 14 రెట్లు ఎక్కువ రాబట్టింది.
భారతదేశంలో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా మొత్తం 858 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం చైనాలో మంచి ఆదరణ పొంది వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కథ తన గుర్తింపును దాచిపెట్టి, పాడటం ద్వారా పేరు తెచ్చుకున్న అమ్మాయి కథ. ఆమె బురఖా ధరించి పాడిన పాటల వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర తన కెరీర్లోనే అత్యంత కష్టతరమైన పాత్ర అని అమీర్ పేర్కొన్నాడు. ఈ పాత్రకు సంబంధించిన కథకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, నాది చాలా కష్టతరమైన పాత్రలలో ఒకటి అని అన్నారు. జైరా వసీం సినీ కెరీర్లో ఈ సినిమా రెండో సినిమా. దంగల్ వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన తర్వాత ఆమె మళ్లీ అమీర్‌తో కలిసి పనిచేసింది. ఆ తర్వాత ఆమె ది స్కై ఈజ్ పింక్‌లో కనిపించింది.. దురదృష్టవశాత్తు అదే ఆమె ఆఖరి చిత్రమైంది.
Read Also:Benefits of Peanuts: వేరుశెనగల వలన ఎన్నో లాభాలు.. ఇవి తెలిస్తే రోజూ తింటారు!
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!